అక్షర ఉదయమ్
Date of Publish : 23 February 2025, 11:09 pm Posted by : అక్షర ఉదయమ్

కోటప్పకొండకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

 

పల్నాడు జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగే కోటప్పకొండ తిరుణాళ్లకు ఆదివారం ఆర్టీసీ యంత్రాంగం సిద్ధమైంది. నరసరావుపేట డిపోలో కోటప్పకొండకు ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేశారు. నరసరావుపేట నుంచి 280 బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడపనున్నారు. కోటప్పకొండ వద్ద ఘాట్ రోడ్ దిగువ నుంచి ఎగువకు 85 శేషాద్రి బస్సులను నడపనున్నారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ ఘాట్ రోడ్ దిగువ వరుకు రూ.30 లు, కోటప్పకొండ దిగువ నుంచి కొండ పైకి రూ.25 లు టికెట్ ధరను ఆర్టీసీ అధికారులు నిర్ణయించామని తెలిపారు. కావున ప్రజలు ఈ సర్వీసును ఉపయోగించుకోవాల్సిదిగా కోరారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.