అక్షర ఉదయమ్
Date of Publish : 04 February 2025, 1:31 am Posted by : అక్షర ఉదయమ్

నరసరావుపేటలో వాహనాలు తనిఖీలు చేసిన అధికారులు

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

 

నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్ లో సోమవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వాహనాలపై జరిమానా విధించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉండాలని డ్రైవర్లకు సూచించారు. కళాశాల బస్సుల్లో బస్సు సామర్థ్యాన్ని మించి విద్యార్థులను అధిక సంఖ్యలో ఎక్కించిన వారిపై జరిమానా విధించామని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనీషా అన్నారు.