ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ అన్సారియా

అక్షర ఉదయమ్ – గుంటూరు
ఇంధన వనరుల పొదుపు ద్వారా భవిష్యత్తు తరాలకు ఇంధన భద్రతను కల్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల సందర్భంగా మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద విద్యుత్ పొదుపు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ఇంధనం మన ఆర్థిక వ్యవస్థకి ప్రధాన పూనాది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఇంధనాన్ని వినియోగించాలి” అని తెలిపారు.

అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం, స్టార్ రేటింగ్ గల గృహోపకరణాలను వినియోగించడం, సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.