నరసరావుపేటలో తల్లి, ఏడు నెలల పసికందు మృతి కేసులో సంచలన విషయాలు
అక్షర ఉదయమ్ – నరసరావుపేట
నరసరావుపేటలో తల్లి, శిశు కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ నెల 5న జరిగిన ఈ ఘటనలో భార్య త్రివేణి (25), ఏడునెలల పసికందు శరత్ మృతిచెందిన సంఘటనకు భర్త శ్రీకాంత్ (30)నే కారణమని దర్యాప్తులో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం నరసరావుపేట నుండి రొంపిచర్ల మండలంలోని కొత్తపల్లికి బైక్‌పై వెళ్తూ రావిపాడు వద్ద భార్య, బిడ్డలను ఎన్.ఎస్.పి కాలువలో తోసి చంపాడు. మొదట ‘కారు అడ్డువచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాం’ అంటూ నాటక మాడిన శ్రీకాంత్ మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్లో విచారణ జరిపారు.

ఇంచార్జి డీఎస్పీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్‌కు మరో యువతితో అక్రమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. అదే నేపథ్యంలో భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో భార్య, బిడ్డలను అడ్డు తొలగించాలని ఆలోచించాడని చెప్పారు.
ఈ దారుణానికి పాల్పడిన శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా..? పరిశీలిస్తున్నామని, సంబంధిత వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.