ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అక్షర ఉదయమ్ - నెల్లూరు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు...