ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీలు నిర్వహించేందుకు చర్యలు: మంత్రి కందుల దుర్గేష్
ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీలు నిర్వహించేందుకు చర్యలు: మంత్రి కందుల దుర్గేష్ అక్షర ఉదయమ్ - విజయవాడ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో జరిగిన అమరావతి బాలోత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ పోటీలను పరిశీలిస్తూ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. చిన్నారుల్లోని సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడానికి...