ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం

జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం.

కొత్త జిల్లాలతో కలిపి ఏపీలో మొత్తం 28కి పెరగనున్న జిల్లాల సంఖ్య.. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల.
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపేందుకు కేబినెట్ ఆమోదం.

ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు.
రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు మార్పు, రాజంపేటను కడప జిల్లాకు మార్చే ప్రతిపాదనకు ఆమోదం.

రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు మార్చే ప్రతిపాదనకు ఆమోదం.
అక్షర ఉదయమ్ – అమరావతి
