ఈ రోజే భోగాపురానికి తొలి విమానం ల్యాండింగ్ (ట్రైయల్ రన్నింగ్)
- నెరవేరనున్న ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక

అక్షర ఉదయమ్ – విజయనగరం
ఏపీలోని విజయనగరం జిల్లా లోని భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇవాళ ఉదయం 11గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయిల్ రన్ జరగనుంది. నిర్మాణ పనులు దాదాపు 96% పూర్తి అవ్వటంతో ఈ ట్రయిల్ రన్ జరుపుతున్నారు.ఢిల్లీ నుంచి ఎయిరిండియా ఫ్లెట్లో కేంద్రమంత్రి రామ్మోహన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీజీసీఏ అధికారులు రానున్నారు. ట్రయల్ రన్ సక్సెస్ అయితే మే నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధమైన ఎయిర్లైన్స్ తో కేంద్రం చర్చలు జరపనుంది. మొదటి దశలో ఏటా 60లక్షల మంది రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.