నీలం గుడ్డు పెట్టిన కోడి

నీలం గుడ్డు పెట్టిన కోడి     సాధారణంగా కోడిగుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు గోధుమ వర్ణంలో ఉండే కొన్ని రకాల గుడ్లను కూడా మార్కెట్లో చూస్తుంటాం. కానీ, కర్ణాటకలోని ఓ కోడి మాత్రం నీలం రంగు గుడ్డు పెట్టింది. కర్ణాటక లోని దేవనగరి జిల్లా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ కోళ్లను పెంచుతారు. ఆయన వద్ద 10 నాటుకోళ్లు ఉన్నాయి. అందులో ఓ కోడి ఇటీవల ఒక రోజు నీలం రంగులో గుడ్డు పెట్టింది. సాధారణ గుడ్డు కంటే భిన్నంగా ఉండటంతో...