అక్షర ఉదయమ్
Date of Publish : 20 October 2025, 11:55 am Posted by : అక్షర ఉదయమ్

సైబర్ నేరగాళ్ల మోసాన్ని చాకచక్యంగా తిప్పికొట్టిన వ్యక్తి

సైబర్ నేరగాళ్ల మోసాన్ని చాకచక్యంగా తిప్పికొట్టిన వ్యక్తి

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

బాపట్ల జిల్లాలో సైబర్ నేరగాళ్లు చేసిన మోసపూరిత ప్రయత్నం ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వ్యాపారి శ్రీనివాసరావు కుమార్తె వివరాలు సేకరించిన నేరగాళ్లు, ఆమె బెంగళూరు పోలీస్ స్టేషన్లో అదుపులో ఉందని, కేసు నుండి విముక్తి పొందడానికి రూ.5 లక్షలు ఆన్లైన్లో పంపాలని శ్రీనివాసరావును డిమాండ్ చేశారు. అయితే, ఇటీవల దీపావళి సెలవులకు కుమార్తె ఇంట్లోనే ఉండటంతో, ఇది నకిలీ కాల్ అని శ్రీనివాసరావు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే నేరగాళ్లు ఫోన్ కట్ చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలని ఎస్సై భార్గవ్ సూచించారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.