అక్షర ఉదయమ్
Date of Publish : 05 November 2026, 5:55 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

అక్షర ఉదయమ్, విజయవాడ :

 

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

నవంబర్‌ 18న ప్రత్యేక సమావేశానికి సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. నవంబర్‌ 23న ఉదయం 11 గంటలకు వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరపాలని, ఆ రోజు ఎన్నిక జరగక పోతే నవంబర్‌ 24న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా జాబితా విడుదల చేసింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో, కృష్ణా జిల్లాలో పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీల్లోనూ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరుగుతుంది. గతంలో జారీ చేసిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసి తాజా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.