సత్వర న్యాయానికి గుంటూరు జిల్లా ఎస్పీ గారికి బాధిత బాలిక కుటుంబీకుల కృతజ్ఞతలు
అక్షర ఉదయమ్ – గుంటూరు
బాధితులకు సత్వర న్యాయం చేయుటకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘటన జరిగిన ఏడాది కాలంలోనే రిమాండ్ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష పడుటలో విశేష కృషి చేసిన ఎస్పీ గారు.
చేబ్రోలు మైనర్ బాలిక కిడ్నాప్, హత్య కేసును ఛాలెంజ్ గా తీసుకుని, నిందితుడిని నాలుగు నెలలు గాలించి మరీ అరెస్ట్ చేయించిన ఎస్పీ గారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలలో నిందితులకు న్యాయస్థానాల్లో అత్యంత వేగంగా శిక్షలు పడుటకు పోలీసు శాఖ విశేష కృషి చేస్తుందని ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని తెలిపిన ఎస్పీ గారు.
హత్యకు గురైన తమ బిడ్డకు ఈ తీర్పు ఘనమైన నివాళి ఇస్తుందని బాలిక తండ్రి దావీదు, కుటుంబ సభ్యులు తెలిపారు
తమ బిడ్డ హత్య కేసులో ఇంత త్వరగా తమకు న్యాయం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని, ఎస్పీ సతీష్ కుమార్ గారి లాంటి అధికారి పోలీస్ శాఖలో ఉంటే బాధితులకు సత్వర న్యాయం తప్పక జరుగుతుందనీ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.
మాలాంటి సామాన్యుల సమస్యలను పరిష్కరించడానికి ఆ భగవంతుడు ఎస్పీ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుస్సును ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.
అదే విధంగా కేసు దర్యాప్తు చేసిన తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్ రావు గారికి, చేబ్రోలు ఎస్సై వెంకట కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు గారు, చేబ్రోలు ఎస్సై వెంకట కృష్ణ గారు, బాలిక తండ్రి దావీదు, మేనమామ చిలక. లక్ష్మయ్య, ఇతరకుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..