తిరుపతి–షిర్డీ ప్రత్యేక రైలు ప్రారంభం

తిరుపతి–షిర్డీ ప్రత్యేక రైలు ప్రారంభం

 

అక్షర ఉదయమ్ – తిరుపతి

 

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి మరో ప్రసిద్ధ క్షేత్రమైన సాయినగర్ షిర్డీ మధ్య నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే, జలశక్తి సహాయ మంత్రి సోమన్న అధికారికంగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు.

తిరుపతి రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి జెండా ఊపి రైలును డిపార్ట్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జనార్ధన్ రెడ్డి “ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రెండు ఆధ్యాత్మిక కేంద్రాల అనుసంధానం కోసం ఈ కొత్త రైలు సేవను ప్రారంభించాం. దీని ద్వారా భక్తులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది” అని పేర్కొన్నారు.

రైల్వే అధికారులు మాట్లాడుతూ కొత్త రైలు ద్వారా తిరుపతి–షిర్డీ మధ్యన నేరుగా ప్రయాణించే సౌకర్యం ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల నుంచి షిర్డీ వెళ్లే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

తిరుపతి–షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు (07425 – 07426) ప్రారంభం దక్షిణ భారత్‌లోని ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది. అధికారులు ఈ రైలు ద్వారా భక్తుల రాకపోకలు పెరుగుతాయని, పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.