సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్

- ఈనెల 10వ తేదీన అనంతపురం మీదుగా వెళ్లే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ ని గమనించాలి
- జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీసులు సూచించిన రూట్లలో ప్రయాణించాలి..
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
అక్షర ఉదయమ్ – అనంతపురం
ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం మీదుగా వెళ్లే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ ని గమనించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీసులు సూచించిన రూట్లలో ప్రయాణీకులు ప్రయాణించాలని అన్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట నుంచి బుక్కరాయసముద్రం – నాయనపల్లి క్రాస్ – నార్పల క్రాస్ – బత్తలపల్లి – ధర్మవరం – ఎన్‌ఎస్ గేట్ – NH-44 మార్గంలో ప్రయాణించాలి.
కర్నూలు నుంచి తిరుపతి /చెన్నై వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట నుంచి బుక్కరాయసముద్రం – నాయనపల్లి క్రాస్ – నార్పల క్రాస్ – బత్తలపల్లి – కదిరి – మదనపల్లె మార్గంలో ప్రయాణించాలి.
బళ్లారి నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా చెళ్లికెర – తుమ్కూరు – నెలమంగళ – బెంగళూరు మార్గంలో ప్రయాణించాలి.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా ఎన్‌ఎస్ గేట్ మీదుగా ధర్మవరం – బత్తలపల్లి – నార్పల క్రాస్ – నాయనపల్లి క్రాస్ – బుక్కరాయసముద్రం – వడియంపేట – NH-44 మార్గంలో ప్రయాణించాలి.
తిరుపతి / చెన్నై నుంచి కర్నూలు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ తప్పించుకుని కదిరి – బత్తలపల్లి – నార్పల క్రాస్ – నాయనపల్లి క్రాస్ – బుక్కరాయసముద్రం – వడియంపేట – NH-44 మార్గంలో ప్రయాణించాలి.
బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే వాహనాలు అనంతపురం తప్పించుకుని బెంగళూరు – నెలమంగళ – తుమ్కూరు – చెల్లికేర మార్గంలో ప్రయాణించాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు సదరు విజయోత్సవ సభలో పాల్గొనే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు కొనసాగేందుకు పోలీసు వారు సూచించిన ఆంక్షలు తప్పకుండా పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.