శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో వీరబ్రహ్మం
అక్షర ఉదయమ్ - తిరుమల శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి 28 వరకు జరుగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిబ్రవరి 19 – 28 వరకు శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుగనున్న సందర్భంగా...