హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్

అక్షర ఉదయమ్ – హైదరాబాద్
హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఇప్పటివరకు సీపీగా ఉన్న సీవీ ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సజ్జనార్, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బదిలీల్లో భాగంగా సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా నియమించారు.
ఇప్పటి వరకు నగర కమిషనర్‌గా సేవలందించిన సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన తన బాధ్యతలను సజ్జనార్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..