రాజ్యసభలో వక్స్ బిల్లుకు ఆమోదం

అక్షర ఉదయమ్ – న్యూఢిల్లీ
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వర్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా ఈ నెల 2న ఈ బిల్లు లోక్ సభలో కూడా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధరాత్రి దాటే వరకూ సభలో విస్తృత చర్చ జరిగింది.