అక్షర ఉదయమ్
Date of Publish : 14 February 2025, 10:53 pm Posted by : అక్షర ఉదయమ్

తెనాలిలో మంచినీటి సరఫరా నిలిపివేత: కమిషనర్ శేషన్న

అక్షర ఉదయమ్ – తెనాలి

తెనాలి పురపాలక సంఘం పరిధిలోని ఐతానగర్ లో పైప్ లైన్ లీక్ కావడం వల్ల మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని మునిసిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు. శనివారం ఉదయం తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 1వ వార్డు నుంచి 20వ వార్డు వరకు, 35వ వార్డు నుంచి 40వ వార్డు వరకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.