అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో అద్దంకి పిడుగురాళ్ళ జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిని, ప్రముఖ వైద్యులు వున్నం దీపిక నాగ మల్లిఖార్జునరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యులు వున్నం నాగ మల్లిఖార్జునరావు, ఆయన సతీమణి జెడ్పీటీసీ అభ్యర్థి వున్నం దీపిక మాట్లాడుతూ ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రజానీకం సంతోషంగా ఉన్నారని, తమకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో పిడుగురాళ్ళ జెడ్పీటీసీ అభ్యర్థిగా పల్నాడు జిల్లాలోనే ఘన విజయం సాధించ బోతున్నామని వున్నం దంపతులు ధీమా వ్యక్తం చేశారు.