తెనాలి పట్టణంలో రౌడీయిజం, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్

అక్షర ఉదయమ్ – తెనాలి
తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి 1వ, 2వ పట్టణ మరియు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించి, పలు అంశాలను సమీక్షించారు.
- గంజాయి నిర్మూలన
- మహిళల భద్రత
- రౌడీ షీటర్ల అణచివేత
- సైబర్ నేరాలపై అవగాహన
వంటి పలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు ఆదేశించారు.

తెనాలిలో రౌడీయిజం ఎక్కువగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది.ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే తరచుగా నేరాలకు పాల్పడుతున్నారో గుర్తించి వారికి గట్టిగా చర్యలు తీసుకోవాలనీ ఆదేశించడం జరిగింది.వారిపై పీడీ చట్టం లేదా పిట్ NDPS చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రౌడీషీటర్లు ఏ విధంగా నియంత్రించాలో మాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
తెనాలిలో గంజాయి కూడా పెద్ద సమస్యగా ఉంది. ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే గంజాయి వాడుతున్నారో వారందరి పై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయమని ఆదేశించడం జరిగింది.

గంజాయి మరియు రౌడీయిజాన్ని నిర్మూలించడానికి ప్రణాళికా బద్దంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు త్వరగా పూర్తిచేసి,న్యాయస్థానాల్లో శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అదే విధంగా మహిళల భద్రత మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము.మహిళల భద్రతకు సంబంధించి శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో ప్రతి రోజు స్కూళ్లు, కాలేజీల వద్ద నిఘా పెట్టడం జరుగుతుంది.కావున మహిళ భద్రతకు సంబంధించి ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయడం, 60 రోజుల్లోపే ఛార్జ్ షీట్ దాఖలు చేయించి ట్రైల్ నిర్వహించే విధంగా చూడడం జరుగుతుంది.ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.