క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, క్రీడాకారులకు కానుకగా అందిస్తాం

- టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు త్వరలోనే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, క్రీడాకారులు అందరికీ కానుకగా అందిస్తారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ఎమ్మెల్యే యరపతినేని తనయుడు యరపతినేని సాయి నిఖిల్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని స్కాలర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో గత 20 రోజుల నుంచి జరుగుతున్న కీర్తిశేషులు యరపతినేని లక్ష్మయ్య స్మారక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు...