సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందాలి: జిల్లా కలెక్టర్ వినోద్

అక్షర ఉదయమ్ – బాపట్ల
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో అర్హులైన లబ్ధిదారులకు అందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ భావనతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింతగా పెంచి, అర్హులకు సకాలంలో లబ్ధి చేకూరేలా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.