ఏపీలో వాట్సాప్ పాలన – తొలుత 161 సేవలు
- వెల్లడించిన మంత్రి నారా లోకేష్ అక్షర ఉదయమ్ - ఉండవల్లి దేశంలో తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు మొదలయ్యాయి. ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు, వినతులు స్వీకరించేందుకు, అవసరమైన సమాచారం చేరవేసే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తొలి దశలో 161 రకాల సేవలు, రెండో దశలు 300 రకాల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. దీని కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 95523 00009 నెంబర్ ను...