అక్షర ఉదయమ్
Date of Publish : 06 June 2025, 2:32 pm Posted by : అక్షర ఉదయమ్

లోకం ఎటు పోతుంది…!!

లోకం ఎటు పోతుంది…!!

 

ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడల్సిన కన్నతల్లే కూతురిపట్ల కర్కషంగా వ్యవహరించింది. తన స్నేహితులతో పదమూడేళ్ల కూతురిపై అత్యాచారం చేయించింది. ఈ పనిచేసింది కూడా బీజేపీ మహిళా నేత కావడం ఆశ్చర్యకరం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే… బీజేపీ నేత అనామికా శర్మ తన కూతురుపైనే అత్యాచారం చేయించింది. కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అనామిక శర్మ సుమిత్ పట్వాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కాగా నెల రోజుల క్రితం వరకు అనామిక కూతురు తన తండ్రి వద్ద ఉంది. ఈ క్రమంలో తల్లి ఆమె ప్రియుడు కలిసి తనను లైంగికంగా వేధించిన విషయాన్ని తండ్రికి చెప్పుకుని బాధపడింది. దీంతో వెంటనే అనామిక ఆమె ప్రియుడిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిద్వార్ లో అనామికను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైమరీ విచారణలో బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించడంతో పలు సెక్షన్లతో పాటూ నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అనుమతించింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న శుభమ్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు తన వాంగ్మూలంలో 2025 జనవరిలో తల్లి అనామిక ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్ అతని స్నేహితుడు శుభంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్టు పేర్కొంది. అక్కడ మద్యం మత్తులో తన తల్లి అనుమతితో సుమిత్, శుభం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. హరిద్వార్, ఆగ్రా మరియు బృందావన్ సహా పలు హోటళ్లలో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. విషయం తండ్రికి చెబితే తన తల్లి చంపేస్తానని బెదిరించినట్టు తెలిపింది.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..