అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం (IDRR) సందర్భంగా వర్క్‌షాప్

అక్షర ఉదయమ్ – అమరావతి
అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం (IDRR) సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ , యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో సంసిద్ధత మరియు భాగస్వామ్యంతో స్థామర్ధ్యం గల కమ్యూనిటీలను నిర్మించడం’ అంశంపై వర్చువల్ వర్క్‌షాప్ నిర్వహించినట్లు ఏపిఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వర్క్‌షాప్ లోఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, జిల్లాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యూనిసెఫ్ ప్రతినిధులు మొత్తంగా 600 మంది పాల్గొన్నారు.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ విపత్తు ప్రమాద అవగాహన, విపత్తు సంసిద్ధతని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 13న అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు కమ్యూనిటీల సంసిద్ధత, స్థితిస్థాపకత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. కమ్యూనిటీల శిక్షణకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఉపశమన చర్యలపై ముఖ్యంగా దృష్టిసారించాలన్నారు. మెసేజ్లు, వాట్సప్, సోషల్ మీడియా, అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అలెర్ట్స్ చేరవేస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు ఈ హెచ్చరికలు చేరేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కమ్యూనిటీ ఆధారిత విపత్తు ప్రమాద తగ్గింపు (CBDRR) విపత్తుల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు, వీరు విపత్తుకు మొదట ప్రభావితమవడమే కాకుండా విపత్తుకు మొదట ప్రతిస్పందనదారులుగా ఉంటారని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో కమ్యూనిటీలు వారి ప్రణాళికలు, చర్యలు అమలు చేయడం వల్ల బలమైన భద్రతా వలయాలుగా ఏర్పడతారన్నారు.
శిక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, స్వచ్ఛంద సేవా సంఘాలు, మౌలిక సదుపాయాలు వంటి వాటికి నిధులు మద్దతు కల్పిస్తే త్వరితగతిన జీవనోపాధికి మెరుగైన రక్షణ లభిస్తుందని వెల్లడించారు.స్థానిక కమ్యూనిటీల ప్రమేయం వల్ల విపత్తు ప్రమాద తగ్గింపు (DRR) ప్రణాళికలుపై సమాజం యొక్క అనుభవం మరియు అవగాహన ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటాయని వీరి భాగస్వామ్యంతో పరిష్కారాలను మరింత ఆచరణాత్మకంగా, ప్రభావవంతంగా అమలు చేయవచ్చన్నారు.
“విపత్తులకు కాదు, నిధుల స్థితిస్థాపకత” అనే అంతర్జాతీయ నూతన అంశం ఒక పెద్ద మార్పుకు పిలుపునిస్తుందన్నారు. విపత్తు తర్వాత ప్రతిస్పందన, పునరుద్ధరణ కోసం ఎక్కువ ఖర్చు చేయడం కంటే విపత్తు సంసిద్ధత, విపత్తుల ముందు ప్రమాద తగ్గింపుకు నిధులు మంజూరు చేయడం వలన ప్రాణాలను, జీవనోపాధిని కాపాడవచ్చని తెలిపారు. విపత్తు ప్రమాద తగ్గింపు దార్శనికతతో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్, ఇతర సంస్థలు కమ్యూనిటీ ఆధారిత విపత్తు ప్రమాద తగ్గింపు (CBDRR) పై దృష్టిసారించాలని సూచించారు.
యూనిసెఫ్ నుంచి డా.మహేంద్ర రాజారామ్, డా.బి.ప్రసాద్, ఎన్ఐడిఎం నుంచి డా.బాలు, ఎస్డీఎంఏ నుంచి జిఐఎస్ ఎక్స్పర్ట్ హరీష్ నాయుడు, ప్రాజేక్టు మేనేజర్ డా.బస్వంత్ రెడ్డి పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.