అక్షర ఉదయమ్
Date of Publish : 06 February 2025, 6:39 pm Posted by : అక్షర ఉదయమ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

అక్షర ఉదయమ్ – విశాఖపట్నం

విశాఖలో కాలేజీ బస్సు ఢీకొని ఓ యువ ఇంజనీర్ మృతి చెందాడు. కొత్తపాలెం ఆదర్శనగర్ కు చెందిన ఉమ్మి ఆదినారాయణ ఓ కార్పెంటర్. ఆయనకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు వెంకట బాలాజీ (26) ఇంజనీరింగ్ పూర్తిచేసి షిప్ యార్డ్ లో అప్రెంటీస్ గా పనిచేస్తున్నాడు. గురువారం విధులకు వెళుతుండగా గోపాలపట్నంలో రఘు ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.