అక్షర ఉదయమ్
Date of Publish : 19 October 2025, 7:51 pm Posted by : అక్షర ఉదయమ్

తెనాలిలో యువకుడి కిడ్నాప్

తెనాలిలో యువకుడి కిడ్నాప్

 

 

అక్షర ఉదయమ్ – తెనాలి

 

గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తెనాలికి చెందిన మణికంఠ అనే యువకుడు రెండేళ్ల క్రితం వినుకొండకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి యువతి తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు. పలుమార్లు ఇంటికి పిలిచినా అత్త వ్యవహార శైలి నచ్చకపోవడంతో కుమార్తె, అల్లుడు వెళ్లలేదు.

ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మరో నలుగురితో కలిసి తెనాలిలోని అల్లుడి ఇంటికి విజయలక్ష్మి వచ్చారు. మణికంఠపై దాడికి పాల్పడి కిడ్నాప్ చేశారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న మూడో పట్టణ ఎస్సై కరీముల్లాకు మణికంఠ స్నేహితుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. వెంటనే స్పందించిన ఎస్సై మరో కానిస్టేబుల్ తో కలిసి గాలింపు చేపట్టారు. కారును వెంబడించి చేబ్రోలు మండలం చేకూరు వద్ద ఐదుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని మూడో పట్టణ పీఎస్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.