అక్షర ఉదయమ్
Date of Publish : 24 September 2026, 4:18 pm Posted by : అక్షర ఉదయమ్

టిడ్కో ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ “చింతలపూడి”

టిడ్కో ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అద్దంకి నియోజక వర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ “చింతలపూడి”

 

అక్షర ఉదయమ్ – అద్దంకి

 

అద్దంకి పట్టణ సమీపంలో అసంపూర్తిగా నిలిచిన టిడ్కో ఇళ్లను అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ కేవలం కొన్ని బిల్డింగ్‌లకు రంగులు వేసి, మొత్తం ఇళ్లు పూర్తి అయిపోయాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం దారుణమని అన్నారు. ఇళ్ల లోపలి పనులు అసంపూర్తిగా ఉండటమే కాకుండా, నాణ్యతా ప్రమాణాలు లోపించాయని చెప్పారు.

 

ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులకు, మహిళలకు కనీస వసతులు కూడా లేవని, రాజకీయ కక్ష సాధింపులు మాని, రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. 

 

అర్హులైన ప్రతి పేదవాడికి తక్షణమే టిడ్కో ఇళ్లను కేటాయించి, వారి సొంతింటి కలను సాకారం చేయాలని ఆయన కోరారు.