పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 08 మంది నిందితుల అరెస్ట్

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 08 మంది నిందితుల అరెస్ట్

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

అంగీకారం లేకుండా వివాహం చేసుకున్న ఘటనలో అబ్బాయిని చంపిన అమ్మాయి అన్న, స్నేహితులు. చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర హత్య కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.ఈ ఘటనకు సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో గుంటూరు ఈస్ట్ డిఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు అరెస్ట్ వివరాలను వెల్లడించారు.

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ నందు Cr.No.300/2025, u/s 103(1), 109(1) r/w 3(5) BNS (302, 307 r/w 34 IPC) నందు నమోదు చేయబడిన కేసు ప్రకారం, ఫిర్యాదుదారుడు కుర్ర శివాంజనేయులు s/o గంగయ్య (లేటు), యడవూరు గ్రామం, అమర్తలూరు మండలం, బాపట్ల జిల్లాకు చెందినవారు, తన కుమారుడు కుర్ర నాగ గణేష్ (24) ను కీర్తి దుర్గారావు మరియు అతని స్నేహితులు హత్య చేసినట్లు ఫిర్యాదు చేశారు.

కుర్ర. నాగ గణేష్, కీర్తి వీరాంజనేయ దేవి (21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. ఈ కారణంగా కీర్తి దుర్గారావు (అనగా యువతీ సోదరుడు) కుర్ర. నాగ గణేష్‌పై కక్ష పెంచుకుని అతని హత్యకు కుట్ర పన్నాడు.

2025 అక్టోబర్ 7న తేదీన కుర్ర. నాగ గణేష్ తన స్నేహితుడు సంకుల. కరుణతో కలిసి ముత్తూట్ ఫైనాన్స్, గుంటూరులో పని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో, తెనాలి మండలంలోని పొన్నూరు రోడ్ వద్ద “M కన్వెన్షన్ హాల్” సమీపంలో, కీర్తి దుర్గారావు మరియు అతని స్నేహితులు స్కూటీపై వచ్చి కత్తులతో దాడి చేశారు.అడ్డుకోబోయిన అతని స్నేహితుడినీ చంపడానికి ప్రయత్నించగా అతను పారిపోవడం జరిగింది.తీవ్ర గాయాలతో కుర్ర.నాగగణేష్ అక్కడే కుప్పకూలగా, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

కేసు నమోదు అనంతరం, గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ DSP శ్రీ అబ్దుల్ అజీజ్ గారి పర్యవేక్షణలో, పాత గుంటూరు సీఐ శ్రీ కె. వెంకట ప్రసాద్ గారి నాయకత్వంలో మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో 15.10.2025 రాత్రి 9.30 గంటలకు గుంటూరు రూరల్ మండలం, అడవితక్కెల్లపాడు పంచాయతీ పరిధిలోని గొర్లవారిపాలెం సమీపంలో, A2 నుండి A7 వరకు ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అలాగే, హత్యకు ప్రోత్సాహకుడైన A8 దాసరి వీరయ్య @ చుక్కపల్లి వీరయ్య ను కూడా 15/16.10.2025 అర్ధరాత్రి 12.30 గంటలకు అరెస్ట్ చేశారు.

ప్రధాన నిందితుడు A1 కీర్తి దుర్గారావు ముందుగా 09.10.2025న కోర్టులో లొంగిపోగా, గౌరవ మెజిస్ట్రేట్ గారు రిమాండ్ విధించారు.

మిగిలిన నిందితుల వివరాలు:

షేక్ నూర్ బాష జిలానీ @ జలాలి (21)
బత్తెన లోకేష్ (20)
తుమ్మల శివయ్య @ శివ (25)
జంపని వంశీ (23)
శాఖమురి గోపి కృష్ణ @ గోపి (27)
కీర్తి పాములు (60)
దాసరి వీరయ్య @ చుక్కపల్లి వీరయ్య (50).

ఈ హత్య కేసులో వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్ట్ చేసినందుకు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారు పాత గుంటూరు సీఐ శ్రీ కె. వెంకట ప్రసాద్ గారు, SI శ్రీ ఎన్.సి. ప్రసాద్ గారు, HC-2485 వి. రామారావు, HC-317 మొహమ్మద్ నూరుద్దీన్, PC-4090 కె. గోపాలకృష్ణ, PC-4167 పి. మురళి, PC-4203 ఎ. శ్రీనివాసరావు, PC-4103 డి. రాజశేఖర్ గార్లను అభినందించారు.

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.