విద్యార్థినుల ఫోన్లలో ఉమెన్ సేఫ్టీ యాప్ ఉండాలి: ఎస్ఐ జాస్మిన్

అక్షర ఉదయమ్ – గుడివాడ

 

గుడివాడ టూ టౌన్ ఎస్ఐ జాస్మిన్ శుక్రవారం బస్టాండ్ లో విద్యార్థినిల అందరితో మొబైల్ లో ఉమెన్ సేఫ్టీ యాప్ డౌన్లోడ్ చేయించారు. ఎస్ఐ గారు మాట్లాడుతూ విద్యార్థులు, మహిళలు అత్యవసర సమయాలలో ఈ యాప్ ఉపయోగించి sos సందేశం పంపించవచ్చుని, పోలీస్ శాఖ వెంటనే స్పందించి తమ వద్దకి వచ్చి రక్షణ కల్పిస్తారని ఎస్ఐ అన్నారు. ఈ యాప్ లో పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయని, రాత్రి వేళ ప్రయాణించే మహిళలకు ఈ యాప్ ఉపయోగించడం వలన భద్రత ఉంటుందన్నారు.