ఈ నెల 20న ఏపీ మంత్రివర్గ సమావేశం

అక్షర ఉదయమ్ – అమరావతి

 

ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రి వర్గంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.