సీఎం అయ్యాక తొలి భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్న విజయ్

సీఎం అయ్యాక తొలి భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్న విజయ్

 

అక్షర ఉదయమ్ – చెన్నై

 

“రాజకీయాల్లోకి రావాలని మీరు కోరారు.. మీరే నన్ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేశారు” అన్న విజయ్.. “నా ప్రతి కష్టం, ప్రతి అడ్డంకిని మీ సొంతంగా భావించి నాతో నిలబడ్డారు” అంటూ ప్రజలకు కృతజ్ఞతలు.

“నేను దేవుడు పంపిన దూతను కాదు.. సాధారణ మనిషిని మాత్రమే”.. తమిళనాడుపై దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పు భారం ఉందన్న సీఎం విజయ్.

“పాలనలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర పరిస్థితులు, సవాళ్లు అర్థమవుతాయి” అంటూ వ్యాఖ్యలు.. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసిన విజయ్.

డ్రగ్స్ నియంత్రణ, బాధితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ.. “ప్రజల డబ్బులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయను” అంటూ స్పష్టం చేసిన విజయ్.

“డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు.. అవినీతికి ఎలాంటి చోటు ఉండదు” అంటూ కఠిన హెచ్చరిక.. “ఈ ప్రభుత్వం ప్రజలది.. కలిసి మరింత బలమైన తమిళనాడును నిర్మిద్దాం” అన్న సీఎం విజయ్.