
అక్షర ఉదయమ్ – విజయవాడ
విజయవాడలోని సితార గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ మంటలు కారణంగా సమీప నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.