
అక్షర ఉదయమ్ – మాచర్ల
మాచర్ల మండలం రాయవరం, కొత్తపల్లి గ్రామాల్లో కొరియా బృందం సభ్యులు పర్యటించారు. బుధవారం రాయవరంలో ఆఫిక్ కి కేటాయించిన సర్వే నెంబరు 795/3లో 151 ఎకరాలు, కొత్తపల్లిలో సర్వే నెంబరు 67/5లో 450 ఎకరాల భూములను పరిశీలించారు. ఈ భూముల్లో లెదర్ పార్క్ నిర్మాణం కోసం అధ్యయనం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సుధాకర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.