
అక్షర ఉదయమ్ – వినుకొండ
వినుకొండ అభివృద్ధిలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశ్రమలు తెచ్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీనిలో భాగంగా మండలంలోని వెంకుపాలెం వద్ద సర్వే నంబర్ 1లో 98.20 ఎకరాల భూమి లెదర్ పార్క్ కు బుధవారం కేటాయించారు. రీబక్, పుమా, నైక్ లాంటి ప్రముఖ కంపెనీల లెదర్ పరిశ్రమలు ఏర్పాటుకు బుధవారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కొరియన్ బృందం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.