మంగళగిరి టిడ్కో కాలనీలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    మంగళగిరి టిడ్కో కాలనీలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

    అక్షర ఉదయమ్ – మంగళగిరి

    మంగళగిరి పట్టణం టిడ్కో కాలనీలో దివీస్ లేబొరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టిడ్కో కాలనీకి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతి ఇచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ప్లాంట్ మొత్తం కలియతిరిగి దివీస్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ క్యాన్ ను మంచినీటితో నింపి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివీస్ సంస్థ సీఎస్ఆర్ హెడ్ జి.నగేష్, కూటమి నేతలు పాల్గొన్నారు.

    మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3 కోట్ల వ్యయంతో 19 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

    మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దివీస్ లేబొరేటరీస్ సంస్థ రూ.3 కోట్ల వ్యయంతో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల 19 ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేయడం జరిగింది.


    మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద – 4,
    మంగళగిరి టిడ్కో కాలనీలో – 2,
    పెనుమాక టిడ్కో గృహసముదాయం వద్ద – 2,
    నిడమర్రు టిడ్కో గృహసముదాయం వద్ద – 1,
    నవులూరు టిడ్కో గృహసముదాయం వద్ద – 1,
    ఇప్పటం గ్రామంలో – 1,
    కాజ వద్ద – 2,
    చిర్రావూరు గ్రామంలో – 1,
    చినకాకానిలో – 1,
    ఆత్మకూరు హౌసింగ్ లేఅవుట్ లో – 1,
    కాటమరాజు కొండూరులో – 2,
    ప్రాతూరు గ్రామంలో – 1

    మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేయడం జరిగింది.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...