తహసీల్దార్ సంతకం ఫోర్జరి

తహసీల్దార్ సంతకం ఫోర్జరి
– ఆరుగురిపై కేసు నమోదు

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు అరండల్ పేటలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 2,200 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసిన ఆరుగురిపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన చంద్రమౌళి, విశాఖకి చెందిన రామకోటేశ్వరరావు, మాదల శ్రీవల్లి, మహమ్మద్ పర్వేజ్, గింజుపల్లి వీరయ్య చౌదరి, వెంకటరెడ్డి కలిసి ఈ పని చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. చంద్రమౌళి లింకు డాక్యుమెంట్ల కోసం స్థలాన్ని శ్రీవల్లి, రామకోటేశ్వరరావు పేరున కొరిటెపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడని, గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..