జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం

జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం

మాజీ మంత్రి, పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు విడదల రజిని


అక్షర ఉదయమ్ – నరసరావుపేట

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయమని మాజీ మంత్రి, పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు విడదల రజిని స్పష్టం చేశారు.

పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని రజిని అన్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్.. ఆయన వస్తున్నారంటే జనం ఆగరని విడదల రజిని చెప్పారు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారని, జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయమని తేల్చి చెప్పారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం” అని రజిని స్పష్టం చేశారు.

కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది అని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా?. మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది?. అని ప్రశ్నించారు. నాగ మల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారని, అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారని అన్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..