ప్రపంచ రికార్డు సాధించిన అంబటి ఖశ్వి అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ A.R. దామోదర్, ఐ.పి.యస్.,గారు

ప్రపంచ రికార్డు సాధించిన అంబటి ఖశ్వి అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ A.R. దామోదర్, ఐ.పి.యస్.,గారు

అక్షర ఉదయమ్ – ఒంగోలు

ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన అంబటి ఖశ్వి అనే చిన్నారి ఒక సంవత్సరం ఐదు నెలల (17 నెలలు) వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో స్థానం దక్కించుకున్న అంబటి ఖశ్వి (17 నెలలు) ను ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ A.R. దామోదర్, ఐ.పి.యస్. గారు, అంబటి ఖశ్విను ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి కాశ్వీ అధిగమించడం విశేషం.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని, చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారిలో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైనదని జిల్లా ఎస్పీ గారు కొనియాడారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు చిమ్మాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాప తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, కుటుంబ సభ్యులు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in