మాయా “సృష్టి” కీలేడి నమ్రత
- బిచ్చగాళ్ల వీర్యంతో పిల్లలు లేని వారికి సంతానం కల్పిస్తున్న స్పెర్మ్ క్లినిక్లు
- డాక్టర్ నమ్రత కేసులో విస్తు పోయే నిజాలు

అక్షర ఉదయమ్ – హైదరాబాద్
బిచ్చగాళ్లకు బిర్యాని, అడ్డకూలీలకు మద్యం, చదువుకున్న వారికైతే రూ.వెయ్యి నుంచి 4 వేలు, అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇచ్చి వీర్యం, అండాల సేకరణ పేరుతో దందా
ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో.. సికింద్రాబాద్లో దందా నడుపుతున్న డాక్టర్ నమ్రత
డాక్టర్ నమ్రతతో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
దాతల నుంచి వీర్యం, అండాలు కోరుకునేవారు.. ఆ దాతలు బాగా చదువుకున్న వారై, తెలివి తేటలు కలిగిన వారై ఉండాలని భావిస్తారు..
కానీ.. ఈ దందా నడిపే వారు వారికి అంట గడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డా కూలీల వీర్యాన్ని, అండాలను..
పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్న ఆధారాలు
నిబంధనల ప్రకారం ఆరోగ్య వంతులైన వ్యక్తులు, 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వారి నుంచి.. వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఎలాంటి జన్యు వ్యాధులు, అంటు వ్యాధులు లేవని నిర్దారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి..
ఒక దాత నుంచి 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించడం.. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భ ధారణకు మాత్రమే ఉపయోగించాలి.
కానీ ఈ నిబంధనలు అన్నింటినీ పక్కన పెట్టి ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్న స్పెర్మ్ మాయా “సృష్టి” కీలేడి ఈమె.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..