అంతర్ జిల్లా బైకుల దొంగను అరెస్టు చేసిన కొత్తపేట పోలీసులు

అంతర్ జిల్లా బైకుల దొంగను అరెస్టు చేసిన కొత్తపేట పోలీసులు

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ

పల్నాడు జిల్లా, గురజాల మండలం, మాడుగుల గ్రామానికి చెందిన అంతర్ జిల్లా బైకుల దొంగ బొప్పూరి మల్లికార్జున రావు అరెస్ట్ చేశాం.

నిందితుడు వద్ద నుండి 50 బైకులు స్వాధీనం చేసుకున్నాం.

స్వాధీనం చేసుకున్న బైకులు విలువ రూ.25,00,000/-.

మద్యానికి బానిసై నిందితుడు భార్యకు దూరంగా గుంటూరులో నివాసం.

రైల్వే స్టేషన్ ఏరియాలోని మడత మంచాల లాడ్జిలో పని చేసుకుంటూ జీవనం.

2024 నుండి సుమారుగా సంవత్సరంనర నుండి గుంటూరు, దాచేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు.

మాయాబజార్ ప్రాంతంలో నిన్న సాయంత్రం కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు వద్ద నుండి 15 బైకులు కొనుగోలు చేసిన గురజాలకు చెందిన బైక్ మెకానిక్ రాజశేఖర్, గొర్రెల కాపరి మహేష్ వద్ద నుండి 6 బైకులు, సాతులూరు కి చెందిన బేల్దరు మేస్త్రి నుండి 7 బైకులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశాం.

స్వాధీనం చేసుకున్న బైకులను, నిందితుడిని కోర్టుకు ప్రవేశపెడుతున్నాం.