విజయవాడ – సింగపూర్ విమాన సర్వీస్ ఎప్పుడంటే..!

అక్షర ఉదయమ్ – విజయవాడ
విజయవాడ- సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని చెప్పారు. నవంబర్ 15 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని, విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయానికి చేరుకోవచ్చని తెలిపారు.
జులై 28న సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సర్వీసు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో ఈ సర్వీసును ఏర్పాటు చేశామన్నారు.
స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. భవిష్యత్లో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం తెలుగు ప్రవాస భారతీయులకు విశేష ప్రయోజనం కలిగించడమే కాకుండా, వ్యాపార మరియు సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందని, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు, ఏపీ సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.