నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులు అరెస్ట్

అక్షర ఉదయమ్ – గుంటూరు
తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన ఇద్దరు కర్ణాటక వ్యక్తులు అరెస్ట్.
రూ.7,00,000/- నగదు స్వాధీనం.
రాంగ్ కాల్(Wrong Call) చేసి, గుంటూరుకు చెందిన భార్య, భర్తలను నమ్మించి నకిలీ బంగారం విక్రయించిన ఐదు మంది నిందితుల ముఠా.
రాంగ్ కాల్(Wrong Call) చేసి, గుంటూరుకు చెందిన భార్య, భర్తలను నమ్మించి నకిలీ బంగారం విక్రయించిన ఐదు మంది నిందితుల ముఠా.
రాగి – జింక్ మిశ్రమంతో కూడిన అర కేజీ నకిలీ బంగారు ముక్కలను ఇచ్చి రూ.12,00,000/- నగదు కాజేసిన వైనం.

గుంటూరుకే చెందిన మరొక జంటను మోసం చేయడానికి ప్రయత్నించే క్రమంలో ముఠాలోనీ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన అరండల్ పేట పోలీసులు.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ శ్రీ అరవింద్ గారి పర్యవేక్షణలో అరండల్ పేట సీఐ శ్రీ ఆరోగ్య రాజు గారు, ఎస్సై సుబ్బారావు గారు మరియు పోలీస్ సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టినారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ డిఎస్పి గారి కార్యాలయంలో అరెస్టు చేసిన నిందితులను హాజరుపరిచి, తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుందని, మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని వెస్ట్ డిఎస్పీ గారు వెల్లడించడం జరిగింది.
నిందితులను చాకచక్యంగా అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అరండల్ పేట సీఐ ఆరోగ్య రాజు గారిని, ఎస్ఐ ఎం.సుబ్బారావు గారిని, మరియు కానిస్టేబుళ్లు డేవిడ్, ఉమామహేశ్వరరావు లను వెస్ట్ డీఎస్పీ గారు అభినందించడం జరిగింది.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.