తీవ్ర తుపాన్ గా మారిన మొంథా

తీవ్ర తుపాన్ గా మారిన మొంథా

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గడచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర – వాయవ్య దిశగా ఇది కదులుతోంది. మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర -వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కిమీ వేగంతో గాలులు వీయనున్నాయి.