తీరం దాటిన మొంథా తుపాను

తీరం దాటిన మొంథా తుపాను

 

అక్షర ఉదయమ్ – అమరావతి

బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంథా ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.

మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది.

మంగళవారం రాత్రి 11.30 నుంచి 12.30 మధ్యలో ‘మొంథా‘ తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణశాఖ పేర్కొంది.

తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుపానుగానే కొనసాగనుంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలింది.

మొంథా‘ ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్ గఢ్ వద్ద మరింత బలహీన పడనుంది.

తుపాను ప్రభావంతో గాలుల ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో గాలుల వేగం కొనసాగుతోంది.