శరవేగంగా జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    శరవేగంగా జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లు

     


    అక్షర ఉదయమ్ – మంగళగిరి

    మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సందర్శించి, 16వ తేదీన జరగనున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

    ఈ సందర్భంగా మంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, సభా వేదిక నిర్మాణం, వేదికకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, వీవీఐపీ, వీఐపీలకు ఏర్పాటు చేసే వసతులు, ఇతర జిల్లాల నుండి హాజరయ్యే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులు, సిబ్బందికి కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అనంతరం, ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని, తగినంత పోలీస్ బలగాలతో సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హోం మంత్రి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ సత్య యేసు బాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, బెటాలియన్ కమాండెంట్ (ఎస్పీ) నగేష్ ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...