ఉద్యోగాలే ఉద్యోగాలు…

అక్షర ఉదయమ్ – విజయవాడ

డీఎస్పీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంపందింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు.