బెంగాల్ లో మరో దారుణం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన యువతి(23) పశ్చిమబెంగాల్ దుర్గాపుర్ లోని శోభాపుర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం చేసేందుకు తన ఫ్రెండ్ తో కలిసి కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో కొందరు దుండగులు వీరిని వెంబడించారు. దీంతో యువతి ఫ్రెండ్ భయపడి పారిపోగా.. దుండగులు బాధితురాలిని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లారు. అక్కడ వారిలో ఒకడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ సమాచారం అందగానే ఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు వైద్య కళాశాల సిబ్బంది, యువతి స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు.
ఇటీవల సౌత్ కోల్కతాలోని లా కళాశాలలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అధికార తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి ముందు ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై చోటుచేసుకున్న అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.