PGRS కార్యక్రమానికి వచ్చే ప్రజల ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది కేటాయింపు: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    PGRS కార్యక్రమానికి వచ్చే ప్రజల ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది కేటాయింపు: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్

    అక్షర ఉదయమ్ – గుంటూరు

    ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ(PGRS)” కార్యక్రమంలో తమ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్న ప్రజలు తమ ఫిర్యాదులు రాసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా ఫిర్యాదులు రాయించుకోవడానికి డబ్బులు కూడా వెచ్చిస్తున్నారని, పేద ప్రజలు నగదు చెల్లించలేక అవస్తలు పడుతున్నారని గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి వచ్చినది.

    “ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం” గా పని చేస్తున్న గౌరవ ఎస్పీ గారు ప్రజల ఫిర్యాదులు రాసిపెట్టడానికి సుశిక్షితులైన పోలీస్ సిబ్బందినీ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

    కావున ప్రజల యొక్క నగదును, విలువైన సమయాన్ని ఆదాచేయడం కోసం వచ్చే సోమవారం నుండి జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమానికి వచ్చే ప్రజలకు వారి ఫిర్యాదులు రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయపడతారు అని గౌరవ ఎస్పీ గారు తెలిపారు.

     

     

     

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    అర్నబ్ తుపాన్ బీభత్సం – రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు

    అక్షర ఉదయమ్, అమరావతి :  అర్నబ్ తుపాన్ బీభత్సం నుంచి రాష్ట్రాన్ని సాధారణ...

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...