మద్యానికి డబ్బులు ఇవ్వలేదని హత్యాయత్నం

📰 Generate e-Paper Clip

అక్షర ఉదయమ్ – తెనాలి

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి పై హత్యాయత్నం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నాజరుపేటకు చెందిన బసవయ్య వద్ద అంగలకుదురుకు చెందిన అనిల్ ఆటోలు అద్దెకు తీసుకుంటూ ఉంటాడు. అనిల్ తో పాటు ఇస్లాంపేటకు చెందిన జూపల్లి వేణు, అతని స్నేహితుడు రాము మద్యం తాగడానికి బసవయ్యను డబ్బులు అడగ్గా అతను ఇవ్వలేదు. దీంతో కత్తితో బసవయ్యను గొంతుపై పొడిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తెనాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.